Thursday, December 26, 2024

ట్విట్టర్‌లోకి తిరిగి ట్రంప్, కంగనా?

- Advertisement -
- Advertisement -

Will Trump, Kangana Ranaut make comeback to Twitter?

మస్క్ చొరవతో నిషేధాల ఎత్తివేత

వాషింగ్టన్ : ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లోకి తిరిగి అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, భారతీయ నటి కంగనా రనౌత్‌లు యుజర్లుగా చేరే అవకాశాలు ఉన్నాయి. ఏ కారణం చేతనైనా ట్విట్టర్ వాడకం శాశ్వత నిషేధం ఎవరిపైనా ఉండబోదని కొత్తగా ట్విట్టర్ సారధ్య బాధ్యతలు స్వీకరించిన మస్క్ తెలిపారు. విద్వేషపు అంశాల కారణంగా ట్రంప్, కంగనా ఇతర ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలపై ఇప్పటివరకూ నిషేధం అమలులో ఉంది. ఘోరమైన సైబర్ నేరాలకు తప్పిదాలకు పాల్పడే వారి ఖాతాలపై తప్ప ఇతరత్రా ఎవరిపైనా పూర్తిస్థాయి నిషేధం ఉండబోదని మస్క్ స్పష్టం చేశారు. ఇప్పటికే ట్విట్టర్ ఖాతా వాడకందారుడిగా తిరిగి రావాలని ట్రంప్‌ను మస్క్ కోరారు. దీనిపై ట్రంప్ స్పందించలేదు. అయితే తాను తిరిగి ట్విట్టర్ యుజర్‌గా చేరే అవకాశం ఉందని తాజాగా కంగనా రనౌత్ తెలిపారు. ఈ విధంగా ఈ బ్యాన్ పరిధిలో ఉన్న ఇతరులు కూడా తాము తిరిగి ట్విట్టర్ యుజర్లమవుతామని ఆశిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News