- Advertisement -
పెర్త్: టి-20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. 13.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. రిజ్వాన్ 39 బంతుల్లో 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. పాక్ బ్యాట్స్ మెన్లలో ఫఖర్ జమాన్ 16 బంతుల్లో 20 పరుగులు చేసి బ్రండన్ గ్లోవర్ బౌలింగ్ లో ఎడ్వర్డ్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. బాబర్ అజమ్ నాలుగు పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన షాదాబ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. పాక్ బ్యాట్స్ మెన్లలో ఇఫ్తికర్ అహ్మాద్(06), షాదాబ్ ఖాన్ (04) పరుగులు చేశాడు తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ పాకిస్తాన్ ముందు 92 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
- Advertisement -