- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలను నాటడం అలవర్చుకోవాలని నటి శ్రీష కుమార్ కోరారు. ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి శ్రీషకుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది.. మనం కూడా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా విజయానంద్, అపర్ణ, అర్జున్ కల్యాణ్‌కు మొక్కలు నాటాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఆమె విసిరారు.
- Advertisement -