Sunday, January 5, 2025

గుజరాత్‌లో సీ295 విమానాల తయారీ కర్మాగారానికి మోడీ శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

వడోదర: మనదేశంలో ప్రైవేట్ రంగంలో తొలి విమానాల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. టాటా ఎయిర్‌బస్ కన్సార్టియం దీనిని ఏర్పాటు చేస్తోంది. స్వయం సమృద్ధ భారత దేశం (ఆత్మ నిర్భర్ భారత్) దిశగా ఇది మరో ముందడుగు అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. భారత వాయుసేన (ఐఎఎఫ్)ను ఆధునికీకరించాలనే లక్షంతో ఈ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.21,995 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇక్కడ సీ 295 విమానాలను తయారు చేస్తారు. మోడీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో వైమానిక రంగానికి సంబంధించిన తదుపరి తరం మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఈ కంపెనీ ఉంటుందని తెలిపారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాయి. సీ295 విమానాల కోసం గత ఏడాది ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.21,000 కోట్లతో 56 విమానాలను కొనాలని నిర్ణయించింది. వీటిలో 16 విమానాలు స్పెయిన్ నుంచి వస్తాయి. మిగిలిన 40 విమానాలు వడోదరలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలో తయారవుతాయి. సీ 295 విమానాలను యూరోప్ బయట తయారు చేస్తుండటం ఇదే మొదటిసారి.

PM Modi lays foundation stone for C-295 aircraft facility

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News