Saturday, November 23, 2024

బండిపై టిఎన్జీవోల భగ్గు

- Advertisement -
- Advertisement -

TNGO Employees denied Bandi Sanjay comments

నేడు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన : టిఎన్‌జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రాజేందర్ పిలుపు
అమ్ముడు పోయామని అనడంలో అర్థం లేదు
రాజకీయాలకు మేం దూరంగా ఉంటాం 
రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే తగిన గుణపాఠం చెబుతాం

అహేతుక ఆరోపణలు చేస్తే సహించబోం

మన తెలంగాణ/సిటీబ్యూరో: రాష్ట్ర టీఎన్జీవో ఉద్యోగులపై భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఉపసహరించుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఎం. రాజేందర్ హెచ్చరించారు. ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిగూడలో బండి సంజయ్ ఉద్యోగులు టిఆర్‌ఎస్‌కు అమ్ముడు పోయారని, పదోన్నతులు,పైరవీలు కోసం మద్దతు పలుకుతున్నారని, జీవో 317తో ఉద్యోగులు చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారని, ఉద్యోగ సంఘాల నాయకుల మీద కేసులు పెడుతామని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే తరహాలో ఇష్టానుసారంగా మాట్లాడారని, మరోసారి మాట్లాడటం చూస్తుంటే సహనం కోల్పోయినట్లు ఉందన్నారు. సోమవారం రాష్ట్రంగా 33 జిల్లాలో ఉద్యోగులమంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపడుతామని, వెంటనే ఉద్యోగులు, ఉద్యోగసంఘాలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఏపార్టీకి మద్దతు ఇప్పటివరకు ఇవ్వలేదని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విధులు నిర్వహిస్తున్నాం, రాజకీయాలకు తాము దూరంగా ఉంటామన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా రెచ్చిగొట్టే ప్రసంగాలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల ఒకరిపై నొకరు విమర్శలు చేసుకోవాలని, ప్రజలకు సేవలందించే ఉద్యోగులపై అర్థంలేని ఆరోపణలు చేస్తే సహించేదిలేదన్నారు. ఎనిమిదేళ్లుగా అన్ని రకాలుగా ఉద్యోగులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. రెండేళ్లుగా ప్రమోషన్లు, డిఎ, గ్రాట్యూటి ఇస్తుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయాలంటూ ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందన్న బిజెపి నేతల వ్యాఖ్యాలను తీవ్రగంద పరిగణిస్తున్నట్లు తెలిపారు.
అమ్మడం కొనడం బిజెపి విధానంమా: ఖమ్మం జిల్లా టిఎన్‌జివో అధ్యక్షుడు అఫ్జల హాసన్
అమ్మడం కొనడం బిజెపి విధానమా అని ఖమ్మం జిల్లా టిఎన్‌జివో అధ్యక్షుడు అఫ్జల హాసన ప్రశ్నించారు. ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతినేలా పదే పదే అవమానించం సంజయ్‌కు తగదన్నారు. నోరు పారేసుకున్న సంజయ్ ఉద్యోగ సంఘాలకు క్షమాపన చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలు వేరు ఉద్యోగ సంఘాలు వేరన్నారు. తెలంగాణ కోసం జీతాలు, జీవితాలను ఫణంగా పెట్టిన చరిత్ర, త్యాగం ఉద్యోగ సంఘాలదని అన్నారు. సంజయ్ క్షమాపన చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.

TNGO Employees denied Bandi Sanjay comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News