- Advertisement -
దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : మైనర్ బాలుడు కారు డ్రైవింగ్ చేసి మహిళను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న బాలుడు(17) కారు డ్రైవింగ్ చేశాడు. గల్లీలో కారు నడుపుతు వెళ్తుండగా ఇంటి బయట నిల్చున్న మహిళను అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన బాలుడిపై, కారు యజమానిపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -