తిరువనంతపురం: రేడియోలజీ విద్యార్థి 23 ఏళ్ల షారోన్‌రాజ్‌కు జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చి చంపేసిన గర్ల్‌ఫ్రెండ్ గిరిష్మా నేరం చివరకు బయటపడింది. అక్టోబర్ 14న నిందితురాలు గిరిష్మా తన ఇంటికి షారోన్ రాజ్‌ను పిలిచి విషం కలిపిన జ్యూస్ తాగించింది. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన షారోన్‌రాజ్ అక్టోబర్ 24న ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు గిరిష్మాను పోలీసులు అదుపు లోకి తీసుకుని దాదాపు ఎనిమిది గంటలపాటు ప్రశ్నించిన తరువాత ఆమె తానే విషం కలిపిన జ్యూస్ తన ప్రియుడు షారోన్‌రాజ్‌కు తాగించినట్టు ఒప్పుకుందని అక్టోబర్ 31న పోలీస్‌లు నిర్ధారించారు.
తిరువనంతపురానికి చెందిన షారోన్‌రాజ్ ను గిరీష్మాయే హత్య చేసిందని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అజిత్ కుమార్ చెప్పారు. షారోన్‌రాజ్ తో మొదట ప్రేమ వ్యవహారం నడిపిన గిరీష్మా పెళ్లి విషయంలో వెనకడుగు వేసింది. మనం విడిపోదామని ప్రియుడు షారోన్‌రాజ్‌పై ఒత్తిడి తెచ్చింది. దానికి షారోన్ రాజ్ ఒప్పుకోకపోవడంతో ఇది గొడవలకు దారి తీసింది. దీంతో షారోన్‌రాజ్ అడ్డుతొలగించుకోడానికి నిందితురాలు పథకం పన్నింది. ఇంటికి భోజనానికి రమ్మని పిలిచి, ఇంటికి రాగానే కపిక్ అనే క్రిమిసంహారక మందును జ్యూస్‌లో కలిపి తాగించింది. విపరీతంగా వాంతులు కావడంతో షారోన్‌రాజ్ ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని ఎడిజిపి అజిత్ కుమార్ తెలిపారు. గిరిష్మా ఇంటిలో జ్యూస్ బాటిల్, విషం బాటిల్ దొరకడంతో అసలు కుట్ర బయటపడింది. ఇదంతా ముందుగా వేసిన పథకం ప్రకారం జరిగిందని చెప్పారు.
Girlfriend killing her boyfriend with Poison in Kerala