Friday, January 3, 2025

డిఎవి పాఠశాల అనుమతి పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

State education department has renewed DAV school approval

మనతెలంగాణ/హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని డిఎవి పాఠశాల అనుమతిని రాష్ట్ర విద్యాశాఖ పునరుద్ధరించింది. ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిని ఇచ్చింది. ఆ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన చోటు చేసుకోవడంతో ఆ స్కూల్ గుర్తింపును విద్యాశాఖ రద్ధు చేయగా, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా సంవత్సరానికి విద్యాశాఖ అనుమితి ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్నందున పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిఎవి పాఠశాల గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ ఈ విద్యాసంవత్సరానికి అనుమతి ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News