Sunday, November 24, 2024

యాపిల్ ఫోన్ల తయారీ కోసం 45,000 మంది మహిళా ఉద్యోగుల నియామకం

- Advertisement -
- Advertisement -

Apple to hire 45,000 women workers to manufacture phones

త్వరలో నియమించుకునే యోచనలో టాటా గ్రూప్

న్యూఢిల్లీ : యాపిల్ నుంచి మరింత వ్యాపారం, ఉత్పత్తి పెంచే క్రమంలో టాటా గ్రూప్ సుమారు 45 వేల మంది మహిళా ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. తమిళనాడులోని హోసూర్‌లోని తమ ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల సంఖ్యను కంపెనీ పెంచాలనుకుంటోంది. ఈ ప్లాంట్‌లో ఐఫోన్ పరికరాలను తయారు చేస్తారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, కొత్త ఉత్పత్తి లైన్ ఏర్పాటుతో 18- నుంచి 24 నెలల్లో టాటా 45,000 మంది మహిళలను నియమించుకోనుంది. ఫ్యాక్టరీలో ఇప్పటికే 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు, వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. సెప్టెంబరులో కంపెనీ సుమారు 5,000 మంది మహిళలను నియమించుకుంది. హోసూర్ ప్లాంట్‌లోని మహిళా కార్మికులు రూ. 16,000 కంటే ఎక్కువ జీతం పొందుతున్నారని, ఇది పరిశ్రమ సగటు కంటే 40 శాతం ఎక్కువ అని నివేదిక పేర్కొంది.

కార్మికులకు ఆవరణలోనే ఆహారం, వసతి కూడా లభిస్తుంది. దీంతో పాటు కార్మికులకు శిక్షణ, విద్యను కూడా అందించాలని టాటా యోచిస్తోంది. భారతదేశంలో ఐఫోన్‌లను అసెంబుల్ చేసేందుకు ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ విస్ట్రాన్‌తో చర్చలు జరుపుతోంది. ఐఫోన్ తయారీ ద్వారా టాటా టెక్నాలజీ తయారీలో శక్తిగా మారాలని కోరుకుంటోంది. ఐఫోన్‌ను తయారు చేసేందుకు విస్ట్రాన్‌తో టాటా కుదుర్చుకున్న ఒప్పందం ఖరారైతే, ఐఫోన్‌ను తయారు చేసిన తొలి భారతీయ కంపెనీగా టాటా నిలిచిపోతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News