Monday, December 23, 2024

పారితోషికాన్ని రెండింతలు చేసిన త్రిష

- Advertisement -
- Advertisement -

ఇండస్ట్రీలో హీరోల పారితోషికంతో పోలిస్తే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువే. హీరోలు ఏడాది ఒకటి రెండు సినిమాలు చేస్తే హీరోయిన్లు మాత్రం నాలుగైదు సినిమాలు చేస్తూ ఆ లోటును భర్తీ చేసుకుంటున్నారు. దీనికి తోడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్.. కమర్షియల్ యాడ్స్.. సోషల్ మీడియాలో బ్రాండ్స్ ప్రచారం వంటివి చేస్తూ సంపాదనలో తాము హీరోలకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇక మార్కెట్ ను సొమ్ము చేసుకోవడంలో అందరి కంటే హీరోయిన్లు ముందు ఉంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ లిస్టులో వెటరన్ బ్యూటీ త్రిష పేరు మరోసారి తాజాగా వినిపిస్తోంది. 39 ఏళ్ళ వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్న త్రిష తాజాగా తన పారితోషికాన్ని డబుల్ చేయడం ఆసక్తిని రేపుతోంది. ఇండస్ట్రీకి ఇప్పుడు పరిచయం అవుతున్న హీరోయిన్లు ఒకటి రెండేళ్లలోనే కనుమరుగు అవుతున్నాయి.

అలాంటిది హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలో 23 ఏళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతోంది. ‘వర్షం’ సినిమాతో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న త్రిష ఒక దశాబ్దం పాటు టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో రేసులో ఆమె కొంత వెనుకబడింది. ఈ క్రమంలోనే త్రిష పలు లేడి ఓరియండ్ సినిమాల్లోనూ నటించింది. అయితే ఇవేమీ తనకు పెద్దగా కలిసి రాలేదు. 2018 నుంచి త్రిషకు సరైన హిట్ లేదనే చెప్పొచ్చు. ఇలాంటి సమయంలోనే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్ 1’లో త్రిషకు అవకాశం లభించింది. ఈ సినిమాలో యువరాణి కుందవైగా త్రిష అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో త్రిషకు ఫుల్ డిమాండ్ నెలకొంది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తుండటంతో తన పారితోషికాన్ని డబుల్ చేసి క్యాష్ చేసుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు కోటిన్నర మాత్రమే పారితోషికం తీసుకుంటుండగా పొన్నియిన్ సెల్వన్ మూవీ హిట్‌తో ఆ రేట్ డబుల్ అయిందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే త్రిష స్టార్ హీరోలు విజయ్, అజిత్ సినిమాల్లో నటించబోతుందని సమాచారం. ప్రస్తుతం త్రిష నటిస్తున్న ’రోడ్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Trisha hikes her remuneration after PS1 Success

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News