టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన దిల్ రాజు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తూ దూకుడుగా వెళ్తున్నారు. అందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు‘ సినిమా ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ‘వారసుడు’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. తమిళ్‌లో ‘వారిసు’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలకు సిద్ధమవుతోంది.
2023 పొంగల్ బరిలో నిలపడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ’వారసుడు’ సెట్స్‌లో తీసిన విజయ్‌కు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. దిల్ రాజు తనయుడు కూడా ఉండటంతో ఈ పిక్ మరింత ప్రత్యేకంగా మారింది.. నెట్టింట వైరల్ అయ్యేలా చేసింది. దిల్ రాజు, ఆయన రెండో భార్య వైఘారెడ్డి దంపతులు ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ బాబు ను చూసికొని మురిసిపోతున్న ఓ ఫోటో ఆ మధ్య నెట్టింట సందడి చేసింది. కానీ అందులో దిల్ రాజు వారసుడి ముఖాన్ని చూపించలేదు. అయితే ఇప్పుడు ’వారసుడు’ షూటింగ్‌లో దిల్ రాజు కొడుకుని తన చేతుల్లో ఎత్తుకొని కనిపించాడు విజయ్. ఇందులో బాబు చాలా ముద్దుగా క్యూట్‌గా ఉన్నాడు. వారి బ్యాక్‌గ్రౌండ్‌లో దిల్ రాజుని కూడా చూడవచ్చు. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Vijay with Dilraju’s Son Photo Viral