Sunday, December 22, 2024

ఎంఎల్‌సి చల్లా భగీరథ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

MLC challa bhagiratha reddy Health condition is bad

అమరావతి: ఎంఎల్‌సి చల్లా భగీరథ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి కాలేయ వ్యాధితో బాధపడుతుండడంతో బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆదివారం తీవ్రమైన దగ్గు రావడంతో నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు చల్లాను హైదరాబాద్‌లోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ఎఐజి ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లోని ఖాళీ ప్రదేశంలోకి రక్తస్రావం వెళ్లడంతో ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు తొలి రోజు 100 శాతం ఆక్సిజన్ ఇచ్చామని, ఇప్పుడు 60 శాతానికి తగ్గించామన్నారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎఐజి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News