మొరెనా: మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం నూరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురైయా హోటల్ సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ డంపర్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బొలేరోలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఈ ప్రమాదం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని టిక్టోలీ గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
5 Killed in Road Accident in Madhya Pradesh