Monday, December 23, 2024

జాన్వీ.. సినిమా అంటే ప్రాణం పెడుతుంది

- Advertisement -
- Advertisement -

Janvi Kapoor's 'Mili' Movie press meet in Hyderabad

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రూపొందిన బాలీవుడ్ మూవీ ’మిలీ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. ఈ థ్రిల్లర్ మూవీలో జాన్వీ కపూర్, సన్నీ కౌశల్, మనోజ్ పహ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం కలిగింది. సినిమాలో నాది ఛాలెంజింగ్ రోల్. మైనస్ -18 డిగ్రీల ఉష్ణోగ్రతలో 22 రోజుల పాటు చిత్రీకరించాం. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయటం చాలా కష్టం. ఇలాంటి పాత్రలో నటించటం వల్ల మానసికంగా మరింత బలంగా తయారయ్యాను”అని అన్నారు. బోనీకపూర్ మాట్లాడుతూ “ఈ సినిమాలో జాన్వీ అధ్భుతంగా నటించింది. ‘మిలీ’ ఆమె కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన మూవీగా నిలుస్తుంది. శ్రీదేవి ఎలా అయితే సినిమా కోసం కష్టపడేదో జాన్వీ కపూర్ కూడా సినిమా అంటే ప్రాణం పెడుతుంది” అని తెలిపారు. ఈ సమావేశంలో సన్నీ కౌశల్ పాల్గొన్నారు.

Janvi Kapoor’s ‘Mili’ Movie press meet in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News