Thursday, December 19, 2024

పవన్ కల్యాణ్ వి పిచ్చి కూతలు: జోగి రమేష్

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిచ్చి కూతలు కూస్తున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఇప్పటంలో పిచ్చి కల్యాణ్ పిచ్చి కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటం అనే గ్రామం జగన్ పాలనలో బాగుపడుతోందని గ్రామస్థులు ఆనందంగా ఉన్నారని, ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ యత్నిస్తున్నాడని మండిపడ్డారు. పవన్ వ్యవహారం ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే అక్కసుతో ఏంటి ఈ చేష్టలు అని మండిపడ్డారు. పవన్ ఇంటి దగ్గర రెక్కీపై తెలంగాణ పోలీసులు ఏమన్నారో తెలియదా? అని అడిగారు. తెలంగాణ పోలీసులు స్పష్టంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని, తాగుబోతుల చేసిన గొడవ అని చెప్పాక రెక్కీ అనటానికి సిగ్గుందా? అని దుమ్మెత్తిపోశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News