- Advertisement -
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. మంత్రి అంబటి తన ట్విట్టర్ లో… ”ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం! కూల్చివేయడానికి సినిమా సెట్టింగు కాదు,షూటింగ్ కాదు” అని ట్వీట్ చేశారు. ఇప్పటికే పర్యటనలో వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు విరుచుకుపడ్డారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయడంతో పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేసిందని పవన్ ఆరోపించారు.
ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం !
కూల్చిపారదొబ్బటానికి
సినిమా సెట్టింగు కాదు,షూటింగ్ కాదు @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) November 5, 2022
- Advertisement -