Monday, December 23, 2024

కేంద్ర కార్మికశాఖ మంత్రితో ఆర్ కృష్ణయ్య భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో శనివారం కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను రాజ్యసభ సభ్యులు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య భేటీ అయ్యారు. ఆయన నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజకృష్ణ ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ బృందం కలిసి 15 బీసీ డిమాండ్లపై దానికి ప్రధానితో చర్చించాలని పత్రం సమర్పించారు. కేంద్రంలో ఓ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అసంఘటిత రంగ కార్మికులైన బీసీ చేతి వృత్తిదారులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర మంత్రికి ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

అలాగే ప్రాథమిక విద్యా స్థాయి నుండి పదో తరగతి వరకు దేశవ్యాప్తంగా బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేయాలని తద్వారా డ్రాప్ అవుట్ శాతం పరిపూర్ణంగా తగ్గిపోతుందని, సంపూర్ణ అక్షరాస్యత సాధన దేశ ప్రగతికి దోహదపడుతుందని, అలాగే దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులకు జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని వర్తింపజేయాలని పై డిమాండ్ల పరిష్కారానికి ప్రధానితో చర్చించి బీసీ సంఘాలతో ప్రధానిని సమావేశపరచాలని భూపేంద్ర యాదవ్ కు ఆర్ కృష్ణయ్య విన్నవించారు. మంత్రిని కలిసిన వారిలో జాతీయ బీసీ నేతలు, ప్రముఖ న్యాయవాది మెట్ట చంద్రశేఖర్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News