Saturday, December 21, 2024

బీజేపీ మళ్లీ అధికారం లోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు

- Advertisement -
- Advertisement -

 

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారం లోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఈమేరకు సిమ్లాలో జరిగిన ‘బీజేపీ సంకల్ప్ పాత్ర 2022’ కార్యక్రమంలో 11 పాయింట్ల మేనిఫెస్టోను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. ఉమ్మడి సమాజం, యువత, రైతులకు సాధికారత , తోటల పెంపకానికి చేయూత, ప్రభుత్వ ఉద్యోగులకు తగిన న్యాయం, పర్యాటకానికి మరింత ఊతమివ్వడమే లక్షంగా మేనిఫెస్టోని రూపొందించామని ఆయన చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో వాగ్దానం చేయని లక్షాలను కూడా బీజేపీ సాధించిందని తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతిలో లక్షాలను నెరవేర్చడం, ప్రభుత్వ ఉద్యోగాలతో సహా రాష్ట్రంలో 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, అన్ని గ్రామాల రోడ్లను పక్కా రోడ్లతో అనుసంధానం, సీఎం అన్నదాత స్కీమ్ ద్వారా 9 లక్షల మంది రైతులకు లబ్ధి, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాల మెరుగుకు శక్తి పేరుతో కొత్త కార్యక్రమం, యువత కోసం రూ,.900 కోట్లతో స్టార్టప్ యూనిట్, పేద మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లతోపాటు ఇతర హామీల అమలు తదితర అంశాలు మేనిఫెస్టోలో కీలకమైనవి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News