- Advertisement -
న్యూఢిల్లీ : గుజరాత్‌ను బిజెపి ఆధ్వర్యపు డబుల్ ఇంజిన్ ద్రోహం బారి నుంచి తమ పార్టీ కాపాడితీరుతుందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తెలిపారు. గుజరాత్ ప్రజలకు తమ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం వాదనను తిప్పికొడుతామని భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ ఓ ట్వీట్‌లో తెలిపారు. రూ 500లకు వంటగ్యాసు సిలిండర్, యువతకు పదిలక్షల ఉద్యోగాలు, 3 లక్షల రూపాయల వరకూ రైతుల రుణాల మాఫీ వంటి చర్యలకు దిగుతామని భరోసా పలికారు. గుజరాత్‌లో బిజెపి పాలన బెడద తొలిగిపోయి పరివర్తన పండుగ వస్తుందని, దీనిని వేడుకగా నిర్వహించుకుందామని రాహుల్ స్పందించారు.
- Advertisement -