Friday, December 20, 2024

మునుగోడు ఓటమి బిజెపికి చెంప పెట్టు: తమ్మినేని వీరభద్రం

- Advertisement -
- Advertisement -

మునుగోడు ఓటమి బిజెపికి చెంప పెట్టు
రాజగోపాల్‌రెడ్డీ.. దిగజారుడు మాటలు మానుకో
మునుగోడు ప్రజలకు అభినందనలు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి ఓటిమి చెంపపెట్టులాంటిదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అక్కడ గెలుపుకోసం పడరాని పాట్లు పడిందని చెప్పారు. కమ్యూనిస్టులు బలపర్చిన టిఆర్‌ఎస్ అబ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించిన ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభినందనలు తెలిపారు. కష్టపడి పనిచేసిన సిపిఎం, సిపిఐ, టిఆర్‌ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మునుగోడులు గెలిచి, వచ్చే సాధారణ ఎన్నికల్లో తామే ప్రధాన ప్రత్యర్థిమనే సంకేతాన్ని పంపాలనే బిజెపి ఎత్తుగడను అక్కడి ప్రజలు తిప్పికొట్టారన్నారు. అక్రమ మార్గంలో గెలిచేందుకు ఎన్నో ఎత్తులు వేసిందని విమర్శించారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను బిజెపి అప్రజాస్వామికంగా అనే రాష్ట్రాల్లో కూల్చేసిందనీ, తెలంగాణలో కూడా ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయటం ద్వారా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని నిస్సిగ్గుగా ప్రయత్నించిందని చెప్పారు. ఆ కుట్ర బట్టబయలు కావటంతో రాష్ట్ర ప్రజలు ఇలాంటి తప్పుడు పద్ధతులను సహించబోరంటూ ఓటు ద్వారా తమ తీర్పును చెప్పారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుబోయి ఈ ఎన్నికలను తీసుకొచ్చారని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.
కాషాయ కుట్రలు సాగనివ్వం
నైజాం సర్కార్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడిన ప్రాంతమిదన్నారు. వెట్టి, బానిసత్వం నుంచి ప్రజలను విముక్తి గావించేందుకు చైతన్యయుత ఉద్యమాలు సాగిన ప్రాంతిమిదన్నారు. భవిష్యత్‌లోనూ కాషాయుల కుట్రలు సాగనివ్వబోమని హెచ్చరించారు. రాబోయే కాలంలో పరిపానలో ఉన్న లోపాలను సవరించుకుని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గర కావాల్సిన అవసరాన్ని ఈ ఫలితం సూచించిదన్నారు. ముఖ్యంగా పేదలు, గిరిజనులు పోడు భూములు, కార్మికుల, నిర్వాసిత రైతుల, మధ్యతరగతి వర్గాల, నిరుద్యోగ యువకుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్ధిష్ట చర్యలు తీసుకోవాల్సిన అసవరముందన్నారు.
రాజగోపాల్‌రెడ్డివి దిగజారుడు మాటలు
ఓటమి బాధతో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమి అనంతరం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నానంటూనే ఎన్నికలు అక్రమంగా జరిగాయనీ, కమ్యూనిస్టులు అమ్ముడు పోయారని అవాకులు చెవాకులు పేలడం తగదని సూచించారు. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.

Munugode bypoll Result: Tammineni Veerabhadram slams BJP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News