Sunday, December 22, 2024

మునుగోడు ఉప ఎన్నిక.. కారు ‘జయభేరి’

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) పార్టీ జయకేతనం ఎగురవేసింది. సమీప ప్రత్యర్థి,బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డ్డిపై టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. నాలుగో రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన టిఆర్‌ఎస్ పార్టీ, చివరి వ రకూ ఆధిక్యం నిలబెట్టుకుంది. బిజెపి అభ్యర్థి ఆ త ర్వాత రౌండ్‌లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా డిపాజిట్‌కే కోల్పోయిం ది. తొలి మూడు రౌండ్లలో టిఆర్‌ఎస్, బిజెపి మధ్య పోరు హోరాహోరీగా సాగినప్పటికీ క్రమంగా విజయం టిఆర్‌ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మునుగోడు ఉప ఎ న్నిక ఓట్ల లెక్కింపు మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు ని ర్వహించగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి టిఆర్‌ఎస్ పార్టీ 10,113 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేసింది. నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్, హుజుర్‌నగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో వరుసగా గెలిచి టిఆర్‌ఎస్ హ్యాట్రిక్ సాధించింది. బిఎస్‌పి ఈ ఎన్నికలో నామమాత్రపు ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఊ రూరా వార్డువార్డునా తిరిగి నానా హడావుడి చేసిన కేఏ పాల్ చివరకు 805 ఓట్లతో నిజంగానే నవ్వులపాలయ్యారు.

రౌండ్ రౌండ్‌కు పెరిగిన ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో టిఆర్‌ఎస్ పార్టీకి రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు తుది ఫలితాలు వస్తాయనుకున్న అధికారుల అంచనాలు తప్పాయి. నాటకీయ పరిణామాల అనంతరం.. సంస్థాన నారాయణపురం మండలానికి సంబంధించి, నాలుగు, ఐదు, ఆరు రౌండ్లలో ఓట్లను లెక్కించారు. ఇక్కడ ఐదు, ఆరు రౌండ్‌లలో గులాబీ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఐదో రౌండ్‌లో 817, ఆరో రౌండ్‌లో 638 ఓట్ల తేడాతో.. బిజెపిపై టిఆర్‌ఎస్ ముందంజలో నిలిచింది. అనంతరం మునుగోడు మండలంలో ఆరు, ఏడు, ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టారు. అక్కడ కూడా టిఆర్‌ఎస్ ఆధిక్యతను చూపింది. ఏడో రౌండ్‌లో 399, ఎనిమిదో రౌండ్‌లో 536 ఓట్ల తేడాతో… గులాబీ పార్టీ లీడ్‌లో నిలిచింది. చండూరు మండలానికి సంబంధించి.. 8, 9, 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగింది. అక్కడా కారు గుర్తే ముందు వరుసలో నిలిచింది. ఎనిమిదో రౌండ్‌లో 536, తొమ్మిదో రౌండ్‌లో 852, పదో రౌండ్‌లో 484 ఓట్ల ఆధిక్యంతో టిఆర్‌ఎస్ లీడ్‌లో నిలిచింది. గట్టుప్పల మండలం ఓట్ల లెక్కింపును 10, 11 రౌండ్లలో కొనసాగింది. 11వ రౌండ్‌లో 1,358 ఓట్ల తేడాతో భారీ ఆధిక్యాన్ని టిఆర్‌ఎస్ తెచ్చుకుంది.

అప్ప టి వరకు ఇరు పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉండగా… గట్టుప్పల మండల ఓట్ల లెక్కింపుతో టిఆర్‌ఎస్ మెజార్టీ అనూహ్యంగా పెరిగింది. మర్రిగూడ మండలానికి సం బంధించి 11, 12, 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగిం ది. అక్కడా టిఆర్‌ఎస్ పార్టీనే పై చేయి సాధించింది. 12వ రౌండ్‌లో అధికంగా 2 వేలు… 13 రౌండ్‌లో టిఆర్‌ఎస్ తెరాస ఆధిక్యతను చూపింది. నాంపల్లి మం డలం ఓట్లను 13, 14, 15 రౌండ్లలో లెక్కించారు. ఈ రౌండ్లలోనూ టిఆర్‌ఎస్ పార్టీనే ముందంజలో నిలిచింది. 13వ రౌండ్‌లో 1,345 ఓట్లతో టిఆర్‌ఎస్ ముం దంజలో నిలిచింది. 14వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 6,6 12, బిజెపికి 5,557 ఓట్లు పోలయ్యాయి. 14 రౌండ్లు పూర్తయ్యే సరికి టిఆర్‌ఎస్ 10,191 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. చివరి రౌండ్లో టిఆర్‌ఎస్ 1,270, బిజెపి 1,358, కాంగ్రెస్ 238 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్‌లో బిజెపి 88 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ.. 15 రౌండ్లలో కలిపి టిఆర్‌ఎస్ 10,103 మెజార్టీ సాధించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 10,113 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News