న్యూఢిల్లీ: ప్రధాని మోడీ దేశంలో పార్లమెంటరీ ప్రాతిపదిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం విమర్శించారు. సంఘ్‌పరివార్ ఆలోచనా విధానానికి అనుగుణంగా దేశంలో అధ్యక్ష తరహా పరిపాలనా విధానాన్ని తీసుకురావాలని మోడీ యోచిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి పరిణామంతో దేశంలో నియోజకవర్గ ఆధారిత ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. ఈ స్థానంలో ఏకపక్ష గుత్తాధిపత్య పాలనకు దారితీస్తుందని, ఇది దేశ ప్రజాస్వామిక మౌలికతకు భంగకరంగా వాటిల్లుతుందని హెచ్చరించారు.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రజలు కమలం గుర్తుకు వేసే ఓటు తనకు దక్కే ఆశీస్సులుగా మారుతాయని, ఓటర్లు అభ్యర్థులను చూడకుండా కేవలం కమలం పూలను గుర్తుంచుకోవాలని పిలుపు నిచ్చిన విషయాన్ని చిదంబరం గుర్తు చేశారు. ఇప్పటికే మోడీ పార్లమెంటరీ చర్చల ప్రక్రియను వదిలేశారు. ప్రెస్ మీట్స్‌కు దూరంగా ఉంటున్నారు. ఇక మరింత అడుగు పెద్దదిగా వేసి దేశంలో నియోజకవర్గాల వారి ప్రాధాన్యత అంశం అయిన ప్రజాస్వామిక ప్రక్రియను మార్చి అధ్యక్ష తరహా పాలనా దిశకు దిగుతున్న సంకేతాలు వెలువడుతున్నాయని వ్యాఖ్యానించారు.
PM Modi Wants to President Rule: P Chidambaram