యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. మునుగుడు ఫలితాల్లో టిఆర్ఎస్ గెలుపొందిన నేపథ్యంలో సోమవారం లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి సత్యవతి రాథోడ్ కు పండితులు వేదాశీర్వాదం అందించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సిఎం కెసిఆర్ కు మరింత శక్తిని ఇవ్వాలని, మరిన్ని గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. కలలో ఊహించని విధంగా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయాన్ని సీఎం కేసిఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారన్నారు. యాదాద్రి ఆలయం అద్భుత కళాఖండమని, యాదాద్రి భక్తుల సందడితో కన్నుల పండువగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనే గొప్ప సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని చెప్పారు. తిరుమల తిరుపతి దేవాలయంలా యాదాద్రి ఆలయ నిర్మాణం, అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరిగిందని వివరించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందామని.. మునుగోడులో ఆధర్మం పైన ధర్మం గెలిచిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. మునుగోడు టిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి చెందుతుందన్నారు. బిజెపి నాయకులు రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారని, నీచ రాజకీయాలు చేసే మూర్ఖులకు లక్ష్మీనరసింహస్వామి జ్ఞానోదయం కల్పించి మంచి బుద్ధులు ప్రసాదించాలని కొరినట్లు పేర్కొన్నారు.
Satyavathi Rathod visit Yadadri Temple