Saturday, April 5, 2025

చెట్టును ఢీకొట్టిన వాహనం: 13 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

ధన్వాడ : జిల్లాలోని ధన్వాడ మండలం ఏమ్నోన్ పల్లి గ్రామశివారులో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటనలో కర్ణాటకలోని రాయచూర్ నత బజార్‌కు చెందిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం హైదరాబాద్‌కు వెళ్లారు. వారు రాత్రి తిరుగు ప్రయాణంలో దాదాపు ఒంటి గంట సమయంలో తుఫాన్ వాహనం ఏమ్నోన్‌పల్లి శివారులో జాతీయ రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిందని ఎస్‌ఐ తెలిపారు. ఈ సంఘటనలో వాహనంలో ఉన్న 13 మందికి గాయాలయ్యాయని, ప్రమాదం గుర్తించిన రహదారికి సంబంధించని పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అంబులెన్స్‌లో బాధితులను మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వారిని హైదరాబాద్‌కు తరలించామని ఎస్‌ఐ సాయి రమేష్ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News