Monday, December 23, 2024

నగరవాసులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పురస్కరించుకుని విరించి కార్కినోస్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో సోమ, మంగళవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిభిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు. ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్దారణ శిభిరంలో పలు రకాలైన రక్త పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఎక్స్‌రే, హెచ్1ఏబిసి, హెచ్‌పివి వైరస్ స్క్రీనింగ్ లాంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అనంతరం క్యాన్సర్ వైద్య నిపుణులతో కన్సల్టేషన్ ఉంటుందన్నారు.

మనిషి శరీరంలో ఎక్కడైనా అసంబద్దమైన రక్తస్రావం, ఎంతకి తగ్గని, పుండు, మూల మూత్ర విసర్జనా పద్దతులలో మార్పులు ఏర్పడటం, మహిళలో ల రొమ్ము, మనుష్యుల్లోని ఏ శరీరం భాగంలోనైనా గడ్డ, ఎంతకీ తగ్గని దగ్గు, పుట్టుమచ్చలతో మార్పులు రావడం, గొంతు ద్వారా సరైన రీతిలో మింగలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సర్ వ్యాధికి సంకేతాలుగా భావించి వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో పాల్గొనదలచిన వారు ఉదయం 10గంటలకు ఆసుపత్రికి చేరుకోవాలని, ఈసదుపాయాన్ని ప్రజలు వినియోగించునకోవాలని డా. శ్యాంసుందర్ కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News