Sunday, December 22, 2024

చీతాల వేట ఆరంభం

- Advertisement -
- Advertisement -

 

షియోపూర్: నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో రెండు మగ చీతాలు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వేటను మొదలెట్టాయని సోమవారం తెలిపారు. క్వారంటైన్ ఎన్‌క్లోజర్ నుంచి విడుదల చేసిన 24గంటల్లోపు తొలి వేటను నమోదు చేశాయి. చీతాలు రెండు ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున ఆహారంగా దుప్పిని వేటాడినట్లు చీఫ్ కన్జర్వేటర్ ఉత్తమ్‌కుమార్ శర్మ తెలిపారు. సోమవారం ఉదయం పర్యవేక్షక బృందానికి ఈ మేరకు సమాచారం అందిందని వివరించారు. నమీబియా నుంచి భారత్‌కు వచ్చిన చీతాలకు ఇదే తొలి వేటగా పేర్కొన్నారు.

మొత్తం ఎనిమిది చీతాలు సెప్టెంబర్ మధ్యలో నమీబియా నుంచి భారత్‌కు తీసుకురాగా వీటిలో ఫ్రెడ్డీ, ఆల్టన్‌లను శనివారం నుంచి విడుదల చేశారు. చీతాలు వేటాడిన దుప్పిని రెండున్నర గంటల్లో తమ ఆహారాన్ని తిన్నాయని శర్మ తెలిపారు. మిగిలిన ఆరు చీతాలను కూడా క్వారంటైన్ నుంచి దశలవారీగా విడుదల చేస్తామని చీఫ్ కన్జర్వేటర్ వెల్లడించారు. కాగా చీతాలు భారత్‌లో అంతరించిపోయిన 70ఏళ్ల తర్వాత 8చీతాలనుఈ ఏడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తీసుకువచ్చారు. భారత్‌లోని చివరి చీతా ఛత్తీస్‌గఢ్‌లో 1947లో చనిపోయింది. అనంతరం చీతాల జాతి భారత్‌లో అంతరించిపోయిందని ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News