Monday, December 23, 2024

జెకె పోలీస్ రిక్రూట్‌మెంట్ స్కామ్… సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్, ఎఎస్‌ఐ అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో నిందితులైన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ తోపాటు మొత్తం నలుగురిని సిబిఐ అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో ఎఎస్‌ఐ అశోక్‌కుమార్, సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ సురేందర్ సింగ్, మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ప్రదీప్ కుమార్, బజీందర్ సింగ్ ఉన్నారని అధికారులు సోమవారం తెలిపారు. ప్రదీప్‌కుమార్ ప్రింటింగ్ ప్రెస్‌లో ప్యాకింగ్ ఇన్‌ఛార్జి. పేపర్ల కాపీ ముందుగా అభ్యర్థులకు అందజేయడానికి రూ. 20 నుంచి రూ.30 లక్షల వరకు చెల్లింపులు జరిగాయని సిబిఐ దర్యాప్తులో తేలింది. ఈ స్కామ్‌లో ఇంతవరకు 13 మందిని సిబిఐ అరెస్టు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News