Monday, December 23, 2024

ట్విట్టర్ బాటలో ఫేస్‌బుక్

- Advertisement -
- Advertisement -
ఈ వారంలో భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైన కంపెనీ

న్యూయార్క్ : ట్విట్టర్ తర్వాత ఇప్పుడు మెటా (గతంలో ఫేస్‌బుక్) చాలా మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ వారం చివరి నాటికి తొలగింపులు ప్రారంభమవుతాయి. ఎంత మందిని తొలగించవచ్చనేది తెలియదు. 2004లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే భారీ తొలగింపు కావొచ్చని భావిస్తున్నారు. 2022 సెప్టెంబర్ చివరి నాటి కి మెటాలో 87,314 మంది ఉద్యోగులు ఉన్నారు. మెటా ప్ర స్తుతం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కలిగి ఉంది.

అయితే కంపెనీ మెటావర్స్‌పై తన వ్యయాన్ని పెంచుతోంది. మెటావర్స్ అనేది వినియోగదారులు వారి స్వంత అవతార్‌లను సృష్టించగల వర్చువల్ వరల్డ్ అన్నది తెలిసిందే. తక్కువ స్వీకరణ రేటు, ఖరీదైన ఆ ర్ అండ్ డి కారణంగా కంపెనీ నష్టాలను చవిచూస్తోంది. ఉద్యోగుల తొలగింపుతో ఆర్థిక సంక్షోభాన్ని కొంతవరకు తగ్గించగవచ్చని కంపెనీ భావిస్తోంది. మెటా తన డిసెంబర్ త్రైమాసిక ఆ దాయాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది మెటావర్స్‌లో పెట్టుబడుల కారణంగా గణనీయమైన నష్టాలను చవిచూడాల్సి వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సమాచారం తెలియగానే కంపెనీ షే ర్లు భారీగా పతనమయ్యాయి. మెటా స్టాక్ ఈ ఏడాది 70% కంటే ఎక్కువ నష్టపోయింది. బ్రాండ్‌పై నమ్మకం ఉంచాలని మెటా సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ పెట్టుబడిదారులను కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News