Saturday, November 23, 2024

ఉక్రెయిన్ వివాదం తర్వాత తొలిసారి రష్యా, అమెరికా అణు చర్చలు

- Advertisement -
- Advertisement -

మాస్కో:  ఉక్రెయిన్‌కు ఫిబ్రవరి 24న బలగాలను పంపించిన తర్వాత… ఇప్పుడు అమెరికా, రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాల చర్చలు జరుపబోతున్నాయి. ఈ విషయాన్ని రష్యాకు చెందిన వార్తాపత్రిక ‘కొమ్మర్‌సెంట్’ మంగళవారం ప్రచురించింది. ఈ విషయమై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, రష్యా మధ్య చర్చలు ఆగిపోయాయి. అణ్వాయుధాలపై కొత్త ఎస్‌టిఎఆర్‌టి ఒప్పందం కూడా నిలిచిపోయింది. అమెరికా, రష్యా జరుపనున్న చర్చలు మిడిల్ ఈస్ట్‌లో జరుగనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా మీద ఆంక్షలు విధించినందున సాంప్రదాయిక వేదికగా స్విట్జర్లాండ్‌ను మాస్కో కాదనుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News