- Advertisement -
ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో డివై చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. 10 నవంబర్ 2024 వరకు 50వ సిజెఐగా జస్టిస్ చంద్రచూడ్ కొనసాగనున్నారు. 1959 నవంబర్ 11న దనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ ముంబయిలో జన్మించారు. అలహాబాద్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. యుఎస్ఎలోని హర్వర్డ్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు.
- Advertisement -