- Advertisement -
తిరుపతి: తిరుపతిలోని నెహ్రూనగర్‌లో బుధవారం తెల్లవారుజామున స్టడీ అవర్స్‌కు వెళ్లి ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు సహా ఐదుగురు పదో తరగతి విద్యార్థులు కనిపించకుండా పోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మెహత, గుణశ్రీ, మౌనశ్రీ, మరో ఇద్దరు విద్యార్థులు బుధవారం ఉదయం స్టడీ అవర్స్ కోసం వెళ్లి వారి ఇళ్లకు తిరిగి రాలేదు. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు, స్టడీ అవర్స్ సెంటర్‌లో వెతికినా విద్యార్థులు కనిపించలేదు. వారు పాఠశాలకు వెళ్లలేదని సీసీటీవీ ఫుటేజీలో తేలింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని వారి కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించి వెతుకున్నామని పోలీసులు వెల్లడించారు
- Advertisement -