Monday, December 23, 2024

కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి….

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా ముగైయూర్‌ ప్రాంతంలో మద్యం మత్తుల్లో కన్నతల్లిని బతికి ఉండగానే కుమారుడు పూడ్చి పెట్టాడు. స్థానికులు గొయ్యిలో నుంచి బయటకు తీసేవరకు ఆమె చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శక్తివేల్ తన తల్లి యశోదతో కలిసి సిత్తామూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. శక్తివేల్ మద్యానికి బానిస కావడంతో అతడి భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రతీ రోజు మద్య సేవిస్తూ తల్లితో గొడవపడేవాడు. మద్యం మత్తులో తల్లిపై పలుమార్లు దాడి చేశాడు.

మంగళవారం రాత్రి సమయంలో తల్లితో కుమారుడు గొడవపడ్డాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో తల్లిపై దాడి చేశాడు. ఇరుగుపొరుగు వారికి యశోదా కనిపించకపోవడంతో వెతికారు. యశోదా చీర ఇంటి వెనుక వైపు కనిపించింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో స్థానికులు డోర్ బలవంతంగా ఓపెన్ చేశారు. తల్లి ఏమైందని కుమారుడిని ప్రశ్నించగా దాడి చేసి గొయ్యిలో పాతి పెట్టానని చెప్పాడు. గ్రామస్థులు, పోలీసులు గొయ్యి తెరిచేలోగా ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News