Monday, December 23, 2024

భార్య జననాంగాల్లోకి రాడ్ ను చొప్పించి

- Advertisement -
- Advertisement -

భోపాల్: భార్యపై అనుమానంతో చిత్ర హింసలకు గురిచేయడంతో పాటు ఆమె జననాంగల్లోకి రాడ్‌ను చొప్పించడంతో కొన ఊపిరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జ్ఞాన్ వేల్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు.  దినసరి కూలీ చేస్తూ మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో భార్యను పలుమార్లు తీవ్రంగా గాయపరిచాడు.

ప్రతీ రోజు ఆమెను వేధిస్తుండడంతో భర్త చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. తన భర్తకు వద్దకు వచ్చిన తరువాత ఎవరి వద్దకు వెళ్లావని ఆమె అడగడంతో పాటు వేధింపులకు గురి చేశాడు. ఆమెను చితకబాదిన అనంతరం జననాంగాల్లోకి రాడ్‌ను చొప్పించాడు. దీంతో విలవిలలాడుతూ కేకలు వేయడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి  నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News