Monday, December 23, 2024

రొమాంటిక్ ‘ఉరికే ఉరికే…’

- Advertisement -
- Advertisement -

అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిట్ 2′. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్… హిట్ 2 ది సెకండ్ కేస్‌తో మరోసారి పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మీనాక్షి చౌదరి ఇందులో అడివి శేష్‌కు జోడీగా నటించింది. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని సినిమాను నిర్మిస్తున్నారు. గురువారం రోజున చిత్ర యూనిట్ ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. హైదరాబాద్‌లో మూడు కాలేజీలకు చెందిన విద్యార్థుల సమక్షంలో ఈ పాటను విడుదల చేశారు.

ఈ పాటలో సిద్ శ్రీరామ్ అద్భుతమైన గొంతు వీనుల విందుగా ఉంది. అడివి శేష్, మీనాక్షి చౌదరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. విజువల్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ మెలోడీ ట్యూన్‌కి కృష్ణకాంత్ బ్యూటీఫుల్ లిరిక్స్ అందించారు. సాంగ్ అందరినీ ఆకట్ట్టుకుంటోంది. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘హిట్ 2’ రిలీజ్ కానుంది.

Urike Urike Song out from ‘HIT 2’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News