Thursday, December 26, 2024

శ్రీకృష్ణుడితో కూతురు పెళ్లి జరిపించిన తండ్రి: (వీడియో) ఇదిగో

- Advertisement -
- Advertisement -

 

గ్వాలియర్ (మధ్యప్రదేశ్): అనారోగ్యంతో మంచం పట్టిన తన కుమార్తె కోరికను తీర్చేందుకు ఓ వ్యక్తి ఆమెకు గ్వాలియర్‌లో శ్రీకృష్ణ భగవానుడితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. గ్వాలియర్‌ కు చెందిన శిశుపాల్ రాథోడ్ అనే వ్యాపారవేత్త కుమార్తె (26) ఏళ్ల సోనాల్ ఉంది. ఆమె చాలా కాలంగా మంచం పట్టింది. నడవలేని నరాల సంబంధిత రుగ్మతతో బాధపడుతోంది. తన వయసులో ఉన్న అందరు ఆడపిల్లల్లాగే పెళ్లి చేసుకోవాలనుకుంది.

అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెతో పెళ్లికి ఎవరూ సిద్ధంగా లేరు. అన్ని చికిత్సలు ఆమె వైద్య స్థితిలో కనిపించే మార్పును తీసుకురాలేకపోయినందున, ఆమె తండ్రి ఆమెను శ్రీకృష్ణుడికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. “పెళ్లికి ఒకరోజు ముందే నా బంధువులందరినీ ఆహ్వానించాను. నా ఇతర కుమార్తెల పెళ్లిలో నేను చేసే విధంగానే అన్ని ఆచారాలు జరిగేలా చూసుకున్నాను. సోనాల్ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆమె సోదరుడు కూడా సంతోషంగా ఉన్నాడు” అని శిశుపాల్ తెలిపారు. ఈ వివాహానికి సంబంధింన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News