Friday, December 20, 2024

నళిని, రవిచంద్రన్‌ల విడుదలకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆర్‌పి. రవిచంద్రన్‌లను విడుదలచేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం నళిని పేరోల్ మీద ఉంది. ఆమె ముందస్తు విడుదలను కోరుతూ మద్రాస్ హైకోర్టుకు వినతి చేసుకుంది. అయితే దానిని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. కాగా 30 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన ఎ.జి.పెరారివాలన్ విడుదలకు సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద మే 18న ఉత్తర్వులు ఇవ్వడంతో నళిని తన పిటిషన్‌ను దాఖలుచేసుకుంది. అందుకామె పెరారివాలన్ కేసును ఉదాహరించింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 మే 21న తమిళనాడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా హత్యకు గురయ్యారన్నది తెలిసిన విషయమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News