Monday, January 20, 2025

మనీలాండరింగ్‌ కేసు: ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్‌కు ఊరట..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్​ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్​ కు ఢిల్లీ పాటియాలా కోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి జాక్వెలిన్‌కు కోర్టు గతంలో మధ్యంతర బెయిల్​ ఇచ్చింది. ఈ బెయిల్​ గడువు పూర్తికావొస్తుండడంతో ఆమె మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీంతో మధ్యంతర బెయిల్​ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పాటియాలా కోర్టు పొడిగించింది.

ఇక, అదే రోజున జాక్వెలిన్ రెగ్యులర్‌ బెయిల్‌ పై కోర్టు విచారించనున్నట్లు తెలిపింది. కాగా, ఈ మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి కోట్ల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా జాక్వెలిన్‌ అందుకున్నట్లు ఈడీ విచారణలో తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాత్కాలిక బెయిల్‌పై ఉన్న జాక్వెలిన్‌, ఈ కేసులో అరెస్ట్‌ కాకుండా ఉండేందుకు రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ప్రయత్నిస్తోంది.

Jacqueline bail extended by Delhi Patiala Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News