మనతెలంగాణ/పాపన్నపేటః పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కావద్దని సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పేదలకు ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పాపన్నపేట మండల పరిధిలోని 100 మందికి కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం లబ్దిదారులకు శుక్రవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డలకు వరం కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారన్నారు. పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 100 మందికి కళ్యాణలక్ష్మి పథకం కింద ఒక్కొక్కరికి ఒక లక్ష ఒకవంద 16 రూపాయలచొప్పున కోటి రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సమావేశం చిన్న హాల్‌లో ఏర్పాటు చేయడంపై రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 మంది లబ్దిదారులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనే ఇంతపెద్ద కార్యక్రమాన్ని చిన్న హాల్‌లో నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాపన్నపేట సర్పంచ్ టి. గురుమూర్తిగౌడ్, మండల టీఆర్‌ఎస్ పార్టీ అద్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అద్యక్షుడు కుభేరుడు, సర్పంచ్‌లు లింగారెడ్డి, నవీన్, సంజీవరెడ్డి, ప్రమీల, పాపన్నపేట పీఏసీఎస్ చైర్మన్ మల్లేశం, టీఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశం, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నర్సింలు, రాము, మండల పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Padma Devender Reddy distributes Kalyana Lakshmi cheques