Thursday, January 23, 2025

బ్యానర్లను కట్టి ఏమి సాధిస్తారు: ఎంపి లక్షణ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో అడుగుపెట్టవద్దంటూ ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ బ్యానర్లను కట్టి ఏమి సాధిస్తారని బిజెపి ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రధాని పర్యటనను రాజకీయ చేయడం కూడదన్నారు. బిజెపితో రాజకీయంగా విభేదించినా ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం టిఆర్‌ఎస్ నేతలు హాజరుకావాలని ఆయన కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీకి మరిన్ని వినతులు అడిగే అవకాశం లభిస్తుందన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్టును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంఎల్ సి రామచంద్రారావులతో కలిసి ఎంపీ లక్ష్మణ్ పరిశీలించి, మీడియాతో మాట్లాడారు.. ప్రధానమంత్రి మోడీ పర్యటనను అడ్డుకోవాలని కమ్యూనిస్టులను కొంతమంది ఉసిగొల్పుతున్నారని ఆయన ఆరోపించారు.

రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా రాష్ట్రంలోని రైతున్నలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. చేనేత కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జిఎస్‌సిని కార్మికులకే ఖర్చు చేయాలనని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎరువుల కోసం గతంలో రైతులు కొట్లాడుకున్న సందర్భాలను చూశామని ఆయన గుర్తు చేశారు. లైన్లలో చెప్పులు పెట్టి ఎరువులను కొనుగోలు చేసేవారని తెలిపారు. రైతులకు అలాంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశ్యంతో కేంద్రం రామగుండం ఎరువుల ఎరువుల కర్మాగారాన్ని నిర్మించిందని ఆయన చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం వలన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆయన వెల్లడించారు. టిఆర్‌ఎస్ నేతలు మనస్సు మార్చుకుని ప్రధాని పర్యటనలో పాల్గొనాలని ఆయన కోరారు. రాజకీయంలో ఎంతో అనుభవం గడించిన కొందరు నాయకులు రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

MP K Laxman fires on posters against PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News