Monday, December 23, 2024

కష్టపడండి, లేకపోతే దివాలానే..

- Advertisement -
- Advertisement -

 

న్యూయార్క్ : ఎలోన్ మస్క్ తొలిసారిగా ట్విట్టర్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. మరింత లాభాల దిశగా తీసుకురానట్లయితే, కంపెనీ దివాలా తీసే అవకాశముందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది. కంపెనీలో ఉన్నతాధికారుల తొలగింపు, సగం మంది ఉద్యోగులపై వేటు తర్వాత సోషల్ మీడియా కంపెనీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మస్క్ ఉద్యోగులకు హెచ్చరికలు చేసినట్టు సమాచారం. మస్క్ రెండు వారాల క్రితం 44 బిలియన్ డాలర్లకు మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు.

దీని కోసం 13 బిలియన్ డాలర్ల వరకు అప్పు చేశారు. ఏడు బ్యాంకుల నుంచి ఆయన రుణాన్ని తీసుకోవడంతో ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఈ ఖరీదైన ఒప్పందం ట్విట్టర్ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా ట్విట్టర్‌లోని ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు జోయెల్ రోత్, రాబిన్ వీలర్ తమ పదవులకు రాజీనామా చేశారు. ట్విట్టర్ భవితవ్యంపై ఉద్యోగుల్లోనూ ఆందోళన నెలకొనడంతో స్వయంగా కంపెనీ నుంచి వైదొలుగుతున్నారు. ఈ రాజీనామాలు ట్విట్టర్ ఆర్థిక పరిస్థితిని సూచిస్తున్నాయి.

ఎఫ్‌టిసి హెచ్చరిక

టాప్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామా తర్వాత అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమీషన్(ఎఫ్‌టిసి) ట్విట్టర్ బాస్ మస్క్ తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ట్విట్టర్‌ను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, రాజీనామాల వల్ల ట్విట్టర్ రెగ్యులేటరీ ఆర్డర్‌లను ఉల్లంఘించే ప్రమాదం ఉందని ఎఫ్‌టిసి తెలిపింది. దీంతో మస్క్ తొలిసారిగా ట్విట్టర్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఏడాది కంపెనీ బిలియన్ డాలర్లు నష్టపోవచ్చని ఆయన స్వయంగా చెప్పారు. మస్క్ కంపెనీ బాధ్యతలు తీసుకున్న వెంటనే, ప్రకటనదారులు మద్దతు ఇవ్వడం మానేశారు. ఈ కారణంగా ట్విట్టర్ ప్రతిరోజూ 4 మిలియన్ డాలర్లను కోల్పోతోంది. దివాలా, ఎఫ్‌టిసి హెచ్చరికలు, రాజీనామాల గురించిన ప్రశ్నలపై ట్విట్టర్ నుండి ఎటువంటి ప్రతిస్పందన లేదు.

వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి

ట్విట్టర్ కొత్త యజమాని ఎలోన్ మస్క్ సిబ్బందికి మొదటి ఇ-మెయిల్‌ను పంపారు. రాబోయే కష్ట సమయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ముగించాలని ఆయన ప్రకటించారు. దీంతో పాటు ఉద్యోగులు ప్రతి వారం కనీసం 80 గంటలు కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. మహమ్మారి సమయంలో ఉద్యోగులు ఇంటి నుండి పనికి వెళ్లవలసి వచ్చింది. కొనుగోలు చేసిన తర్వాత మస్క్ ఇంటి నుండి పని చేయడానికి తాను వ్యతిరేకమని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కేసుల వారీగా అనుమతించాలని ఆయన చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News