పాట్నా: బిహార్ రాష్ట్రం గయా ప్రాంతంలో మంత్రగత్తెను సజీవదహనం చేసిన కేసులో 14 మందిని పోలీసులు అరెస్టు చేయగా మరో 54 మందిని నిందితులుగా చేర్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పచ్మా గ్రామంలో రితా దేవి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. నవంబర్ 5న రితా దేవి మంత్రాలు చేస్తున్నారనే నేపంతో గ్రామస్థులు ఆమె ఇంటిపై మూక దాడి చేశారు. ఆమెను బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. ఆమె బతికి ఉండగానే మంటల్లో వేసి కాల్చి చంపారు. ఆమె కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా 68 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. నవంబర్ 11న 14 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఎస్‌పి హర్‌పీత్ కౌర్ తెలిపాడు. 2021వ సంవత్సరంలో మంత్రాలు నేపంతో దేశంలో 68 మందిని హత్య చేశారు. బిహార్‌లో రాష్ట్రంలోనే చేతబడి చేస్తున్నారని ఎక్కువగా హత్యలు చేస్తున్నారు.
Telangana news