Monday, December 23, 2024

దోమలకు ఇలా చెక్ పెట్టొచ్చు

- Advertisement -
- Advertisement -

 

చలికాలం వచ్చిందంటే చాలు దోమల బాధ భరించలేం. రాత్రయిందంటే చాలు పడుకోనివ్వవు. అయితే ఈ బాధ పడలేక మార్కెట్లో దొరికే బిళ్లలు, కార్డులు తెచ్చి పెట్టుకుంటారు. అవి మనకి కూడా మంచివి కావు. అనారోగ్యపాలవడం ఖాయం. బయట దొరికేవి కాకుండా ఇంట్లోనే దోమల్ని తరిమే మందును తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం…

కావలసినవి : పది చుక్కల సిట్రోనెల్లా ఎసెన్షియల్ ఆయిల్, పది చుక్కల లెమన్ గ్రాస్ ఆయిల్, ఐదు చుక్కల టీ మొక్కల నుంచి తీసిన ఆయిల్, ఐదు చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, గరాటు, పెద్ద కప్పు ఒకటి, స్ప్రే బాటిల్.

తయారీ విధానం : పైన చెప్పిన అన్ని రకాల ద్రవాలను కప్పులోకి తీసుకొని బాగా కలపాలి. ఆ ద్రావణాన్ని గరాటు ద్వారా స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. దీన్ని ఒకసారి పరీక్షించి, దాని వల్ల ఎటువంటి హానీ జరగదు అని నిర్ధారణ అయిన తరువాతే వాడుకోవాలి. ఈ ద్రావణాన్ని చేతులకు, కాళ్లకు కూడా రాసుకోవచ్చు. కానీ, కళ్లకు మాత్రం తగలనీయకూడదు.

Tips for preventing mosquitos bites
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News