Monday, December 23, 2024

శామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్ 16 బిలియన్ డాలర్ల ఆస్తులు మటాష్

- Advertisement -
- Advertisement -

బహామస్: ఎఫ్‌టిఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్‌మన్ 16 బిలియన్ డాలర్ల ఆస్తులు కొన్ని రోజుల్లోనే హరించుకుపోయాయి. చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో ఆయన ఆస్తులు లుప్తమయ్యాయి. ఆయన క్రిప్టో సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. మంచి ఊపులో ఉన్నప్పుడు అతడి ఆస్తులు 26 బిలియన్ డాలర్లు ఉండింది. కొన్ని రోజుల క్రితం ఆయన ఆస్తులు 16 బిలియన్‌ల మేరకు ఉండేవి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఆయన తన పదవికి శుక్రవారం రాజీనామా చేశాడు. ఆయన స్థానంలో జాన్ జె. రే 3 వచ్చారు. అధికారులు గురువారం ఎఫ్‌టిఎక్స్ డాట్ కామ్ ఆస్తులను స్తంభింపజేశారు. సెక్యూరిటీ నియమాలను ఉల్లంఘించినందుకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ ఆయన సెక్యూరిటీస్ విషయంలో దర్యాప్తుచేస్తోంది.

Sam Bankman Fried lost

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News