Monday, December 23, 2024

అట్టహాసంగా ప్రారంభమైన గిరిజన గురుకుల రాష్ట్రస్థాయి క్రీడలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / భద్రాచలం : భద్రాచలం గిరిజన గురుకుల ప్రాంగణంలో తెలంగాణ ట్రైబల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్సిట్యూషన్స్ బాలికల 6వ రాష్ట్రస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్ మీట్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళా. శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా బ్యాండ్‌పార్టీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలికలు గార్డ్ ఆఫ్ హానర్‌తో మంత్రిని సభా ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ జాతీయ పతాకాన్ని, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఒలింపిక్ పతాకాన్ని, మహబూబబాద్ ఎంపి మాలోతు కవిత సొసైటీ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రితో పాటు ప్రజా ప్రతినిధులు క్రీడాకారుల మార్చిఫాస్ట్ ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు.

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించినట్లు మంత్రి ప్రకటించడంతో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. భద్రాచలం ఐటిడిఎ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ రాష్ట్రస్థాయి క్రీడల రిపోర్టును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని అన్నారు. గిరిజన విద్యార్థుల కోసం చక్కని మెనూతో పౌష్టికారహారం అందిస్తున్నట్లు చెప్పారు. గతంతో గిరిజన గురుకుల 90 ఉండగా ఇప్పుడు 183కు పెంచడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్న విధంగా రాష్ట్రంలో విద్యా విధానం కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు నేడు అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతున్నారని అన్నారు. గిరిజనబాలబాలికల సంక్షేమం, వారి విద్యాప్రమాణాలు పెంపొందించడం కోసం భద్రాచలం ఐటిడిఎ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐటిడిఎ పిఓ పోట్రు గౌతమ్ పేర్కొన్నారు.

అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మహబూబబాద్ ఎంపి మాలోతు కవిత, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలు మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలలో రాణిస్తే ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. అడిషనల్ సెక్రటరీ సర్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. గిరిజన గురుకుల సొసైటీ ద్వారా విద్యాప్రగతికి ఎన్నో విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. నాణ్యమైన విద్య గురుకులాల్లో దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి, గిరిజన గురుకులం ప్రిన్సిపాల్ దేవదాసు, ఐటిడిఎ యూనిట్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పీడీ, పీఈటీలు, ఇంచార్జ్‌లు, క్రీడాకారులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News