Saturday, January 18, 2025

గుజరాత్‌లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ శనివారం మ్యానిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గుజరాత్‌లో అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, గ్యాస్ సిలిండర్, 300యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు రూ.3000 నిరుద్యోగ భృతిని అందిస్తామని హామీ ఇచ్చింది. రెండు దశాబ్దాలకుపైగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారపీఠాన్ని అధిష్ఠించాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. దీనికోసం అన్నివర్గాల ప్రజలపై హామీల వర్షం కురిపిస్తోంది. రైతులకు రూ.3లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని, రైతులు పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.

గుజరాత్ ఎన్నికలకు సంబంధించి సీనియర్ పార్టీ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. వందలాదిమంది ప్రజల అభిప్రాయాలను సేకరించి కాంగ్రెస్ మ్యానిఫెస్టో తయారుచేసినట్లు గెహ్లాట్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ పద్ధతిని అమలుచేస్తామని, ప్రభుత్వరంగంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాలను తొలగిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. కాగా స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 1న మొదటి దశ, డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు నిర్వహించి 8వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.

Gujarat Elections 2022: Congress Manifesto Releases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News