Friday, November 22, 2024

ఢిల్లీలో భూ ప్రకంపనాలు.. భయంతో జనం పరుగులు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం ఇళ్లు, కార్యాలయాల్లోంచి బయటకు పరుగులు పెట్టారు. దాదాపు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. నోయిడా, గురుగ్రామ్ సహా పలుచోట్ల ప్రకంపనలు రికార్డయ్యాయి. గత నాలుగు రోజుల్లో దేశ రాజధాని ప్రాంతంలో భూకంపం రావడం ఇది రెండోసారి. భూకంపం రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో వచ్చిందని భూకంపం కేంద్రం నేపాల్‌లో గుర్తించినట్టు నేషనల్‌సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.

ఢిల్లీతోపాటు ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు రికార్డయ్యాయి. ఇదిలా ఉండగా నాలుగు రోజుల కిందట నేపాల్ లోనే భూప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని జోషిమత్‌కు ఆగ్నేయంగా 212 కిమీ దూరంలో నేపాల్‌లో భూకంపం కేంద్రీకృతమైంది. రాత్రి 7.57 గంటల ప్రాంతంలో మళ్లీ ఈ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. మూడు రోజుల క్రితం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి నేపాల్‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారంలో నేపాల్‌లో సంభవించిన మూడో భూకంపం ఇది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News