Friday, December 20, 2024

సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం వద్ద శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో పదేళ్ల బాలుడు, ముగ్గురు మహిళలు ఉన్నారు. అయ్యప్ప స్వామి పడిపూజకు వెళ్లివస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బాధితులు చెబుతున్నారు. పడిపూజ తర్వాత ట్రాక్టర్ లో గ్రామస్తులు మునగాలకు బయలుదేరారు. అయ్యప్ప ఆలయం నుంచి కిలోమీటరున్నర దూరంలో యూటర్న్ ఉంది. దూరాన్ని తగ్గించేందుకు డ్రైవర్ రాంగ్ రూట్ ఎంచుకున్నాడు. రాంగ్ రూట్ లో 200 మీటర్లు ప్రయాణిస్తే మునగాల చేరుకునే అవకాశం ఉంది.

రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టింది. మృతులను ఉదయ్ లోకేశ్(08), తన్నీరు ప్రమీల(35), గండు జ్యోతి(38), చింతకాయల ప్రమీల(33), కోటయ్య(55)గా గుర్తించారు. ట్రాక్టర్ ను తప్పించే అవకాశం లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని, లారీ హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ట్రాక్టర్, ఆటో, అంబులెన్సుల్లో క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయలైన వారిని ఖమ్మం, సూర్యాపేట ఆస్పత్రులకు తరలించారు. స్పల్పగాయాలైనవారికి కోదాడ ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. టాక్టర్ స్పల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 38 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News