Thursday, December 19, 2024

ఫేస్‌బుక్‌లో ప్రేమ.. వివాహిత తల నరికి చంపిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

 

ఉత్తరప్రదేశ్: హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను ప్రియుడు కొట్టి చంపిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ అమ్రోహాలో చోటుచేసుకుంది. నిందితుడు మహ్మద్ షెహజాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం అమ్రోహా జిల్లాలోని సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయంలో తల నరికిన మహిళ మృతదేహం లభ్యమైంది. 36 ఏళ్ల మహ్మద్ షెహజాద్ అమ్రోహాలో పెయింట్ షాప్ నడుపుతున్నాడు. అతను ఈ ఏడాది ప్రారంభంలో సోషల్ మీడియాలో మహిళతో స్నేహం చేశాడు. స్నేహం ప్రేమగా మారడంతో, ఆ మహిళ షెహజాద్‌ను కలవాలని తన కోరికను వ్యక్తం చేసింది. అతను ఆమెను ఉత్తరప్రదేశ్‌కు రావాలని కోరాడు. నవంబర్ 8న మొదటిసారిగా షెహజాద్‌ను కలవడానికి సల్మా హైదరాబాద్ నుండి బయలుదేరింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రేమించిన సల్మా తనను పెళ్లి చేసుకోవాలని షెహజాద్‌ను కోరింది, కానీ అతను నిరాకరించాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన షెహజాద్ ఆమె తలపై ఇటుకతో కొట్టి గొంతు కోసి హత్య చేశాడు. తన పెయింట్ షాప్ పక్కనే ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయంలో మృతదేహాన్ని పాడేశాడు. అమ్రోహా ఎస్పీ, ఆదిత్య లాంగేహ్ మాట్లాడుతూ… “నవంబర్ 9న మహిళ మృతదేహాన్ని కార్యాలయంలో పడేసినట్లు మేము కనుగొన్నాము. ఆమె ఐడి కార్డ్ సహాయంతో ఆమెను గుర్తించిన తర్వాత, పోలీసులు ఘటనాస్థలిలో మొబైల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మద్యానికి బానిసైన నిందితుడిపై నేరపూరిత కుట్ర, హత్య కేసు నమోదు చేశామని, అతని భార్య కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకుందని, ఘటనపై హైదరాబాద్‌లోని పోలీసులకు సమాచారం అందించామని ఎస్పీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News