Saturday, December 21, 2024

వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌దే

- Advertisement -
- Advertisement -

 

మెల్‌బోర్న్: టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించి ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలిచింది. పాకిస్థాన్‌పై ఐదు వికెట్లతో తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. బెన్ స్టోక్స్(52) జోస్ బట్లర్(26), హరీ బ్రూక్(20), మోయిన్ అలీ(19) ఫిలీప్ సాల్ట్(10) పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో హరిష్ రౌఫ్ రెండు వికెట్లు పడగొట్టగా షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, వసీమ్ తలో ఒక వికెట్ తీశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో శ్యామ్ కురాన్ మూడు వికెట్లు, అదిల్ రషీద్ రెండు వికెట్లు తీసి పాక్ వెన్నువిరిచారు. ఇంగ్లాండ్ క్రీడాకారులు శ్యామ్ కరాన్, అదిల్ రషీద్, బెన్ స్టోక్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ శ్యామ్ కరన్ కు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News