Saturday, December 21, 2024

సెనేటర్‌గా హైదరాబాదీని ఎన్నుకున్న నార్త్ కరోలినా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ అమెరికన్ ముజ్తబా అజీజ్ ముహమ్మద్(37) అమెరికాలోని నార్త్ కరోలినా సెనేట్‌కు మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన మూలాలు మన హైదరాబాద్‌వే. తల్లిదండ్రులు అజీజ్ హస్సన్ జావేద్, ఖమర్ ముహమ్మద్ ఇదివరలో మల్లెపల్లిలో ఉంటుండేవారు. తర్వాత వారు అమెరికాకు వలస పోయారు.

ముజ్తబా 1985 జూన్ 8న ఓహియోలోని టొలెడోలో జన్మించారు. నార్త్ కరోలినా యూనివర్శిటీ నుంచి పట్టభద్రుడయ్యారు. తర్వాత లా డిగ్రీ చేశారు. ఆయన తాత పోలీసు శాఖలో పనిచేసేవారు. ఆయన హైదరాబాద్‌లోని పురానీ హవేలి పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఉద్యోగిగా పనిచేశారు. ముజ్తబా, సబాను వివాహమాడారు. వారికి ముగ్గురు పిల్లలు. వారి పేర్లు ఆయూబ్(7), హమ్జా(5), అమర(1).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News